సల్మాన్‌ కామెంట్‌: షారూఖ్‌, అనుష్క కౌంటర్‌ | Salman Khan tweets on Shahrukh upcoming movie | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ కామెంట్‌: షారూఖ్‌, అనుష్క కౌంటర్‌

Nov 29 2016 7:54 PM | Updated on Sep 4 2017 9:27 PM

సల్మాన్‌ కామెంట్‌: షారూఖ్‌, అనుష్క కౌంటర్‌

సల్మాన్‌ కామెంట్‌: షారూఖ్‌, అనుష్క కౌంటర్‌

షారూఖ్‌ ఖాన్‌ను టార్గెట్‌ చేస్తూ సల్మాన్‌ అనుచిత కామెంట్లు చేశాడు.. హీరోయిన్‌ అనుష్క శర్మకు కోపం తెప్పించాడు..

కోర్టు కేసులు, సూపర్‌ హిట్‌ సినిమాలు, విపరీత ప్రవర్తన.. ఇంకా చాలా కారణాలతో నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ మళ్లీ పక్కవాళ్ల పంచాయితీలో వేలు పెట్టాడు. ఈ సారి ఏకంగా బాద్షా షారూఖ్‌ ఖాన్‌ను టార్గెట్‌ చేస్తూ కామెంట్లు చేశాడు. సదరు కామెంట్‌తో సంబంధం ఉన్న హీరోయిన్‌ అనుష్క శర్మకు కోపం తెప్పించాడు.

విషయం ఏంటంటే.. షారూఖ్‌, అనుష్క హీరోహీరోయిన్లుగా దర్శకుడు ఇంతియాజ్‌ అలీ(హైవే, తమాషా ఫేమ్‌) ఓ సినిమా రూపొందిస్తున్నాడు. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఆ సినిమాకు ‘ది రింగ్‌’అనే టైటిల్‌ అనుకుంటున్నారు. గతేడాది నవంబర్‌లో షూటింగ్‌ ప్రారంభమైన ‘ది రింగ్‌’ వచ్చే ఏడాది(2017) ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ మేరకు దర్శకనిర్మాతలు సంబంధిత సమాచారాన్ని ఎప్పుడో చెప్పేశారు.

కాగా, మంగళవారం రాత్రి షారూఖ్‌,అనుష్కల కొత్త సినిమా పోస్టర్‌ను ట్వీట్‌ చేసిన సల్మాన్‌ ఖాన్‌..‘షారూఖ్‌ ఖాన్‌ సినిమా వస్తోంది.. రిలీజ్‌ డేట్‌ను నేనే ఫిక్స్‌ చేశా. టైటిట్‌ ఏం పెట్టాలో మీరు డిసైడ్‌ చెయ్యండి..’అని కామెంట్‌ రాసి షారూఖ్‌, అనుష్క, ఇంతియాజ్‌లను ట్యాగ్‌ చేశాడు. సల్లూ ట్వీట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన షారూఖ్‌..‘అరే.. ఈ సంగతి నాకు తెలియదే! అయినా డేట్‌ భాయి(సల్మాన్‌) ఫిక్స్‌ చేశాక రిలీజ్‌ చెయ్యక చస్తామా? సరే, ఆ టైటిల్‌ ఏదో నువ్వే చెప్పరాదా..’అని కౌంటర్‌ ఇచ్చాడు. అటు అనుష్క కూడా ‘రిలీజ్‌ డేట్‌ నువ్వు డిసైడ్‌ చేయడమేంటి?’అని ఒకింత ఆగ్రహం ప్రదర్శించింది. విబేధాలు పక్కనపెట్టి కొన్నాళ్లుగా కామ్‌గా ఉంటోన్న ఇద్దరు ఖాన్ల ట్వీట్ల లొల్లి ఎక్కడికి దారి తీస్తుందో చూడాలిమరి!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement