రెజ్లర్‌ను మనువాడిన సాక్షి మాలిక్‌! | Sakshi weds wrestler Satyawart Kadian | Sakshi
Sakshi News home page

రెజ్లర్‌ను మనువాడిన సాక్షి మాలిక్‌!

Apr 3 2017 3:44 PM | Updated on Sep 5 2017 7:51 AM

రెజ్లర్‌ను మనువాడిన సాక్షి మాలిక్‌!

రెజ్లర్‌ను మనువాడిన సాక్షి మాలిక్‌!

రియో ఒలింపిక్స్‌లో మొదటి పతకాన్ని సాధించి.. చరిత్ర సృష్టించిన మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది.

రియో ఒలింపిక్స్‌లో మొదటి పతకాన్ని సాధించి.. చరిత్ర సృష్టించిన మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఆమె ఆదివారం రోహతక్‌లో తోటి రెజ్లర్‌ సత్యవ్రత్‌ కడియన్‌ను వివాహం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో 58 కిలోల కేటగిరీలో సాక్షి కాంస్యం పతకం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో పతకం సాధించిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది.

రోహతక్‌లో అట్టహాసంగా జరిగిన ఆమె వివాహానికి ప్రముఖ రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రెజ్లింగ్‌ క్రీడ ద్వారానే సాక్షికి సత్యవ్రత్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది. సత్యవ్రత్‌ 2010 యూత్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్ షిప్‌లో అతను పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.   

Advertisement
 
Advertisement
Advertisement