సాక్షి టీవీ ఫోటో కాంటెస్ట్‌ విజేతలు వీళ్లే.. | Sakshi Photo contest on International photography day | Sakshi
Sakshi News home page

సాక్షి టీవీ ఫోటో కాంటెస్ట్‌ విజేతలు వీళ్లే..

Aug 20 2016 9:52 PM | Updated on Aug 20 2018 8:31 PM

సాక్షి టీవీ ఫోటో కాంటెస్ట్‌ విజేతలు వీళ్లే.. - Sakshi

సాక్షి టీవీ ఫోటో కాంటెస్ట్‌ విజేతలు వీళ్లే..

అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే సందర్భంగా సాక్షి టీవీ నిర్వహించిన ఫోటో కాంటెస్ట్‌ విజేతల పేర్లు వెల్లడయ్యాయి..

అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే సందర్భంగా సాక్షి టీవీ ఫోటో కాంటెస్ట్‌ నిర్వహించింది. నిత్య జీవితంలో భాగంగా వేర్వేరు సందర్భాల్లో తీసిన ఫోటోలను పంపాలని వీక్షకులను కోరింది. సాక్షి టీవీ కాంటెస్ట్‌కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వీక్షకుల నుంచి వచ్చిన ఫోటోలను పరిశీలించి ఎంపిక చేసేందుకు ప్రత్యేక జ్యూరీని సాక్షి టీవీ ఏర్పాటు చేసింది. వచ్చిన ఫోటోల నుంచి మూడు అత్యుత్తమ ఫోటోలను జ్యూరీ ఎంపిక చేసింది.

ఈ కాంటెస్ట్‌లో  మొదటి బహుమతి రాజమండ్రికి చెందిన  శేషగిరి బాబు గెలుచుకున్నారు. అలాగే ద్వితీయ బహుమతిని కాకినాడకు చెందిన సత్యమూర్తి, తృతీయ బహుమతిని హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన చెన్నవేణి సంపత్ గెలుచుకున్నారు. విజేతలకు సాక్షి టీవీ బహుమతులు అందజేసింది. అలాగే మరో మూడు ఫోటోలు కూడా జ్యూరీని మెప్పించాయి. వరంగల్‌కు చెందిన శరత్ వనం, కూకట్‌పల్లికి చెందిన జనని ముదలియార్, మోసెస్ మనోభిలాష్ తమ ఫోటోలతో వినూత్నత చాటుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement