తెలంగాణలో గ్రామపంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లు మంజూరు చేయనుందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు
కేంద్రమంత్రి దత్తాత్రేయ
కొలనుపాక(ఆలేరు)/యాదగిరికొండ : తెలంగాణలో గ్రామపంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లు మంజూరు చేయనుందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద తాను దత్తత తీసుకున్న నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామాన్ని శనివారం మంత్రి సందర్శించారు. అలాగే యాదగిరిగుట్ట దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. గుట్టకు రైల్వే స్టేషన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు.