సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు సాయంత్రం 6:15 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఎన్నికల షెడ్యూల్ వివరాలను ప్రకటించనుంది. అయితే, ఎన్నికల సంఘం డిసెంబర్ 11న తొలివిడుత ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి మద్యాహ్నం 2గంటల వరకు నిర్వహించనుంది. మద్యాహ్నం రెండు గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్, ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సురేందర్ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్ జర్నల్ కోర్టుకు తెలపనున్నారు. ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేశామని వివరించనున్నారు.
సుప్రీం కీలక ఆదేశాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు మించకుండా ఎన్నికల నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. గత విచారణలో సైతం ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఆదేశాల్ని తెలంగాణ హైకోర్టు ప్రస్తావించింది. ఈ సందర్భంగా ఆర్టికల్ 243(E)(3) ప్రకారం గడువు ముగిసిన తరువాత 6 నెలలోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ విచారణలో పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అడ్వకేట్ జనరల్ వివరించనున్నారు.


