న్యాయమూర్తుల రాజ్యాంగ హక్కును ఎన్‌జేఏసీ లాగేసుకుంది | 'Right to Appoint Judges is Part of Judicial Independence' | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తుల రాజ్యాంగ హక్కును ఎన్‌జేఏసీ లాగేసుకుంది

Jun 19 2015 3:14 AM | Updated on Sep 2 2018 5:24 PM

న్యాయమూర్తుల రాజ్యాంగ హక్కును ఎన్‌జేఏసీ లాగేసుకుంది - Sakshi

న్యాయమూర్తుల రాజ్యాంగ హక్కును ఎన్‌జేఏసీ లాగేసుకుంది

న్యాయమూర్తుల నియామకానికి పట్టుబట్టే న్యాయవ్యవస్థ హక్కు.. ఆ వ్యవస్థ స్వతంత్రతలో, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో...

సుప్రీం కోర్టులో నారీమన్ వాదన
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకానికి పట్టుబట్టే న్యాయవ్యవస్థ హక్కు.. ఆ వ్యవస్థ స్వతంత్రతలో, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో కీలకమైన భాగమని.. ఈ హక్కును జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) లాగేసుకుందని.. సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్. నారీమన్ పేర్కొన్నారు. ఎన్‌జేఏసీ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న జస్టిస్ జె.ఎస్.ఖేహర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట.. సుప్రీంకోర్ట్ అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియషన్ (ఎస్‌సీఏఓఆర్‌ఏ) తరఫున ఆయన గురువారం వాదనలు వినిపించారు.

అంతకుముందు వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి.. ఆరుగురు సభ్యుల ఎన్‌జేఏసీలో న్యాయమూర్తులు ప్రధానంగా ఉంటారని, వారికి ప్రాధాన్యం ఉంటుందని.. ఏదైనా చెడు నియామకం జరిగేట్లయితే వారు దానిని అడ్డుకోవచ్చునని పేర్కొన్నారు. నియామకాలపై పట్టుబట్టే హక్కును మాత్రమే న్యాయమూర్తుల నుంచి ఎన్‌జేఏసీ తీసుకుందని చెప్పారు. దీనికి నారీమన్ పైవిధంగా ప్రతివాదనలు వినిపించారు. రాజ్యాంగ నిర్మాణంపై ఎన్‌జేఏసీ ప్రభావం చూపుతోందని, కాబట్టి ఆ చట్టాన్ని రద్దుచేయాలని పేర్కొన్నారు.

ఎన్‌జేఏసీలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులను సభ్యులుగా నియమించే అంశంపై నారీమన్ వాదిస్తూ.. అటువంటి సభ్యులకు ఓటు హక్కు ఇవ్వకూడదని పేర్కొన్నారు. వివిధ దేశాల్లో సామాన్య వ్యక్తులను న్యాయమూర్తుల నియామక కమిటీల్లో నియమిస్తున్నారని, అటువంటి పద్ధతిని ఇక్కడ కూడా ఎందుకు అమలు చేయరాదని ప్రభుత్వం చేస్తున్న వాదనకు సమాధానం ఇవ్వాలని ధర్మాసనం నారీమన్‌కు సూచించింది. ఆయన శుక్రవారం తన వాదనలు కొనసాగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement