రెనాల్ట్‌ క్విడ్‌ కొత్త వేరియంట్‌ లాంచ్‌.. ధర ఎంత? | Renault launches Kwid variant priced at Rs 3.54 lakh | Sakshi
Sakshi News home page

రెనాల్ట్‌ క్విడ్‌ కొత్త వేరియంట్‌ లాంచ్‌.. ధర ఎంత?

Feb 23 2017 2:47 PM | Updated on Sep 5 2017 4:26 AM

రెనాల్ట్‌ క్విడ్‌ కొత్త వేరియంట్‌ లాంచ్‌.. ధర ఎంత?

రెనాల్ట్‌ క్విడ్‌ కొత్త వేరియంట్‌ లాంచ్‌.. ధర ఎంత?

ఫ్రెంచ్‌ బ్రాండ్‌ ఆటో మేకర్‌ రెనాల్ట్‌ ఇండియా సరికొత్త వెర్షన్‌లో తన హ్యాచ్‌ బ్యాక్‌ కారు 'క్విడ్' కొత్త వేరియంట్‌ ను లాంచ్‌ చేసింది.

న్యూఢిల్ల్లీ: ఫ్రెంచ్‌ బ్రాండ్‌ ఆటో మేకర్‌ రెనాల్ట్‌ ఇండియా  సరికొత్త వెర్షన్‌లో తన హ్యాచ్‌ బ్యాక్‌ కారు 'క్విడ్'   కొత్త వేరియంట్‌ ను లాంచ్‌ చేసింది. దీని ప్రారంభ ధరను రూ 3.54 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)  కంపెనీ నిర్ణయించింది.  క్విడ్‌ ఆర్‌ఎ‍క్స్‌ఎల్‌ 1.0 లీటర్‌ ఎస్‌సీఈ (స్మార్ట్ కంట్రోల్ ఎఫీషియన్సీ)  పేరుతో దీన్ని గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్  మాన్యువల్,  ఆటోమేటిక్‌ మాన్యువల్ ట్రాన్స్మిషన్  వెర్షన్‌ లో  అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ ప్రకటించింది.  ఆటోమేటిక్‌ మాన్యువల్ ట్రాన్స్మిషన్  వెర్షన్‌  క్విడ్‌ ధర రూ. 3.84లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా ఉండనుంది. ఫీచర్లు, ట్రాన్స్‌మిషన్‌ ఆధారంగా దీని గరిష్ట ధర రూ. 4.32 లక్షలుగా ఉండనుందని  కంపెనీ పేర్కొంది.

ఇండియాలో తమ మార్కెట్‌ను మరింత విస్తరించుకోడానికి  ఫ్రెంచ్‌ ఆటో  దిగ్గజం ఈ కొత్త వేరియంట్‌ ద్వారా తమ మార్కెట్‌ను స్థిరీకరించాలని భావిస్తున్నట్టు రెనాల్ట్ ఇండియా సిఇఓ, ఎండి సుమిత్ సాహ్నీ  తెలిపారు. ముఖ్యంగా టైర్‌ ​II-IV లో మార్కెట్లలో వినియోగదారులకు మరింత అందుబాటులోకి యోచనలో ఉన్నట్టు చెప్పారు.


ఇక ఫీచర్స్‌ విషయానికి వస్తే..

  • 1.0 లీటర్ ఎస్‌సీఈ ఇంజన్ సామర్థ్యం
  •  డోర్స్‌పై  న్యూ స్పీడ్‌ స్పోర్ట్స్‌  గ్రాఫిక్స్
  • టు-టోన్ ఓఆర్‌వీఎంఎస్‌
  • 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్
  •  క్విడ్‌ ఏఎంటీ వెర్షన్‌ లో 1.0 లీటర్ ఇంజన్  సహా దాదాపు  ఇవే ఫీచర్స్‌ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement