చిట్ ఫండ్ మోసాలపై ఫోరం | Regulators set up forum to rein in chit funds | Sakshi
Sakshi News home page

చిట్ ఫండ్ మోసాలపై ఫోరం

Aug 8 2013 2:38 AM | Updated on Sep 1 2017 9:42 PM

చిట్ ఫండ్ మోసాలపై ఫోరం

చిట్ ఫండ్ మోసాలపై ఫోరం

చిట్‌ఫండ్ మోసా లపై నియంత్రణ సంస్థలు దృష్టి సారించాయి.

ముంబై: చిట్‌ఫండ్ మోసా లపై నియంత్రణ సంస్థలు దృష్టి సారిం చాయి. ఈ పథకాలపై ప్రభుత్వ విభాగాలు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై సమన్వయానికి ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బుధవారం జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపిం ది.ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సారధ్యంలో జరిగిన సమావేశంలో సెబీ, ఐఆర్‌డీఏ, పీఎఫ్‌ఆర్‌డీఏ చీఫ్‌లు పాల్గొన్నారు. కొత్తగా ఆర్‌బీఐ గవర్నర్ పగ్గాలను చేపట్టబోతున్న రాజన్ కూడా హాజరయ్యారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement