జోడీ అదిరింది గురూ..! | record couple | Sakshi
Sakshi News home page

జోడీ అదిరింది గురూ..!

Sep 19 2015 1:12 PM | Updated on Oct 2 2018 8:39 PM

ప్రపంచంలోనే ఎత్తైన జంటగా రికార్డులకెక్కిన చైనా క్రీడాకారులు.

ఆరడుగులకు ఒక్క అంగుళం ఎత్తున్నా మనం తాడిచెట్టు అనేస్తాం. అబ్బో ఎంత ఎత్తో అని అబ్బురపడిపోతాం. అలాంటిది ఏకంగా 13 అడుగుల 10 అంగుళాల ఎత్తుంటే ఏమనాలి..? అనేదేముంది.. గిన్నిస్ రికార్డు కట్టబెట్టేస్తే పోలా..?! అనుకున్నారు నిర్వాహకులు. అంతే.. గిన్నిస్ ప్రపంచరికార్డుల్లోకి ఈ పొడవైన గణాంకాలు చేరిపోయాయి.
 

నిజానికి ఈ ఎత్తంతా ఒక్క వ్యక్తిదే కాదు లెండి. చైనాలోని ఓ జంటది. 7 అడుగుల 8.98 అంగుళాల ఎత్తున్న సన్ మింగ్ మింగ్ (33), 6 అడుగుల 1.74 అంగుళాలుండే క్సు యాన్ (29) భార్యాభర్తలు. వీరిద్దరూ చైనాలో పెద్ద క్రీడాకారులు కూడా. మింగ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కాగా, యాన్ హ్యాండ్‌బాల్ ప్లేయర్. ఓ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో కలుసుకున్న వీరిద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారు. తర్వాత 2013లో బీజింగ్‌లో వివాహంతో ఒక్కటయ్యారు. రికార్డుల వరకూ బాగానే ఉన్నప్పటికీ కారు, విమానంలోనూ ప్రయాణించేటప్పుడు ఇబ్బందిగా ఉంటోందని వాపోతున్నారు ఈ దంపతులు!

Advertisement
 
Advertisement
Advertisement