ఈ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు | RBI cancels the licence of The Mercantile Urban Co-operative Bank Ltd., Meerut, Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ఈ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

Apr 3 2017 7:07 PM | Updated on Sep 5 2017 7:51 AM

ఈ బ్యాంక్‌  లైసెన్స్‌ రద్దు

ఈ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

ఉత్త‌రప్ర‌దేశ్ కు చెందిన మెర్కంటైల్ అర్బ‌న్ కో-ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ క్యాన్సిల్‌ చేసింది.

లక్నో: ఉత్త‌రప్ర‌దేశ్ కు  చెందిన మెర్కంటైల్ అర్బ‌న్ కో-ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్  లైసెన్స్‌ను భారతీయ రిజర్వ్ బ్యాంక్  క్యాన్సిల్‌ చేసింది.  గత కొంతకాలంగా ఆంక్షలువిధిస్తూ వచ్చిన  మీర‌ట్ లోని ఈ బ్యాంకు లైసెన్స్‌ ను రద్దు చేస్తూ ఆర్‌బీఐ  ఉత్తర్వులు జారీ చేసింది.  ఏప్రిల్‌ 5వ తేదీతో ముగియనున్న బ్యాంక్‌  చెల్లుబాటును  సోమవారం రద్దు చేసింది. గత ఏడాది అక్టోబర్‌ లో  సమీక్షించిన   కేంద్ర బ్యాంకు  ఆరు నెల‌ల పాటు  గడువును పొడిగించింది.

 కాగా  బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35A, సబ్ సెక్షన్ (1) కింద  ప్రకారం సెప్టెంబ‌ర్ 30, 2015 మొదట  ఆంక్షలు విధించింది.  అనంతరం  అక్టోబ‌ర్ 06, 2015  ఆ తర్వాత ఏప్రిల్ 05, 2017 వ‌ర‌కు పొడిగించింది. మార్చి 29, 2016న జారీ చేసిన ఉత్త‌రువుల ద్వారా  బ్యాంకు గ‌డువును పొడిగించారు/సవరించిన సంగతి తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement