రేప్‌ కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌ సింగ్‌ | rape case: Dera Sacha Sauda chief Baba Ram Rahim Singh | Sakshi
Sakshi News home page

పంచకుల సంచలన తీర్పు: గుర్మీత్‌ దోషి

Aug 25 2017 3:16 PM | Updated on Jul 28 2018 8:40 PM

రేప్‌ కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌ సింగ్‌ - Sakshi

రేప్‌ కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌ సింగ్‌

దేశవ్యాప్తంగా తీవ్ర ఉంత్కంఠ రేపిన జంట అత్యాచారాల కేసులో పంచకుల కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

- సంచలన తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ కోర్టు
- హరియాణ, పంజాబ్‌లో హై అలర్ట్‌.. రోడ్లపైనే బాబా అనుచరులు


పంచకుల:
దేశవ్యాప్తంగా తీవ్ర ఉంత్కంఠ రేపిన అత్యాచారాల కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్‌ సింగ్‌ అలియాస్‌ బాబా గుర్మీత్‌ సింగ్‌ రాం రహీంను అత్యాచారం కేసులో దోషిగా తేలారు.

2002లో గుర్మీత్‌ తన ఆశ్రమంలో సాధ్విలుగా  ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. అయితే గుర్మీత్‌కు విధించే శిక్షలను సోమవారం ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు.

కోర్టు తీర్పును అనుసరిస్తూ హరియాణా పోలీసులు.. గుర్మీత్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకుని, అంబాలా సెంట్రల్‌ జైలుకు తరలించారు. అంతకు ముందు కోర్టుకు హాజరయ్యేందుకు గుర్మీత్‌ 300 వాహనాల కాన్వాయ్‌తో హల్‌చల్‌ చేశారు.

రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్‌: డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌పై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన కేసులో శుక్రవారం తీర్పు వెలువడనుండటంతో హరియాణా, పంజాబ్‌ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. గుర్మీత్‌ మద్దతుదారులు, అభిమానులు దాదాపు లక్ష మంది వరకూ పంచకుల చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో పంచకులతో పాటు పంజాబ్, హరియాణాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులకుతోడు 15 వేలమంది పారామిలిటరీ బలగాలను మోహరించారు. అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్‌ విధించారు. డేరా సచ్చా సౌదాకు పంజాబ్, హరియాణాల్లో లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ హైఅలర్ట్‌ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ఇరు రాష్ట్రాల్లోనూ 72 గంటల పాటు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలుపుదల చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టులపై అధికారులు నిఘా పెట్టారు. పంచకులకు వెళ్లే బస్సులు, రైళ్లపై ఆంక్షలు విధించారు. పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

తన ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలపై గుర్మీత్‌ రామ్‌రహీం సింగ్‌ అత్యాచారానికి పాల్పడ్డారని 2002లో ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డేరా చీఫ్‌పై కేసు నమోదు చేసింది. తీర్పు  నేపథ్యంలో సిస్రాలోని 3 గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement