రాందేవ్‌కు యాక్సిడెంటా? వైరల్‌ ఫొటోలు! | ramdev baba fake road acident? viral photos | Sakshi
Sakshi News home page

రాందేవ్‌కు యాక్సిడెంటా? వైరల్‌ ఫొటోలు!

Apr 25 2017 4:04 PM | Updated on Aug 30 2018 4:10 PM

దేశంలో ప్రముఖ యోగా గురువు, పతంజలి ఉత్పత్తుల అధినేత బాబా రాందేవ్‌ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు..

దేశంలో ప్రముఖ యోగా గురువు, పతంజలి ఉత్పత్తుల అధినేత బాబా రాందేవ్‌ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా వదంతులు గుప్పుమన్నాయి. ప్రమాదంలో గాయపడిన ఆయనను స్ట్రెచర్‌ మీద తరలిస్తున్నట్టు ఉన్న ఈ ఫొటోలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో షేర్‌ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే, ఈ కథనాలు, ఫొటోలూ బూటకమని తేలింది. ప్రస్తుతం రాందేవ్‌ బాబా హరిద్వార్‌లో సురక్షితంగా ఉన్నారని సమాచారం. ఫొటోమార్ఫింగ్‌ చేసిన ఫొటోలతో ఎవరో కావాలనే ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఈ ప్రచారం చేస్తున్నట్టు ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. ఈ వదంతులను నమ్మొద్దని వారు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement