బాలీవుడ్‌ నటి అరెస్టు | Rakhi Sawant arrested by police | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌: ప్రముఖ నటి అరెస్టు

Apr 4 2017 4:05 PM | Updated on Aug 20 2018 4:35 PM

బాలీవుడ్‌ నటి అరెస్టు - Sakshi

బాలీవుడ్‌ నటి అరెస్టు

బాలీవుడ్ హాట్‌ భామ రాఖీ సావంత్‌ అరెస్టయింది.

ముంబై: బాలీవుడ్ హాట్‌ భామ రాఖీ సావంత్‌ అరెస్టయింది. పంజాబ్‌ పోలీసులు ఆమెను మంగళవారం ముంబైలో అరెస్టు చేశారు. రామాయణం రాసిన వాల్మీకి మహర్షి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదవ్వడంతో పంజాబ్‌ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

గతేడాది ఓ ప్రైవేటు టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో వాల్మీకి మహర్షి మీద ఆమె చేసిన వ్యాఖ్యలు తమను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని వాల్మీకీ కులస్తులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాఖీసావంత్‌ను అరెస్టు చేసేందుకు లూధియానా కోర్టు సోమవారం వారెంట్‌ జారీచేసింది. దీంతో ఇద్దరు లూధియానా పోలీసుల బృందం ముంబై వెళ్లి.. ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణకు హాజరుకావాలని పదే పదే సమన్లు పంపినా ఆమె రాకపోవడంతో మార్చి 9వ తేదీన వారంటు జారీ అయింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీన ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement