
'పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్న మోదీ'
కొందరు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఫిరోజ్పూర్ జిక్రా, (హర్యానా): కొందరు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కొన్ని అమెరికా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించేందుకు ఔషధ ధరలపై నియంత్రణ ఎత్తివేశారని తెలిపారు. ఫలితంగా కేన్సర్ ఔషధం ధర రూ. 8 వేల నుంచి లక్షరూపాయలకు పెరిగిపోయిందని అన్నారు.
అమెరికా పర్యటనకు వెళ్లేముందు నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. మధుమేహం ఔషధం ధర కూడా పెరిగిందన్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తల కోసమే దేశాన్ని నడిపే పరిస్థితి వస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.