ఖాతాదారులకంటే బ్యాంకులకే లాభం | profit than customers of banks | Sakshi
Sakshi News home page

ఖాతాదారులకంటే బ్యాంకులకే లాభం

Oct 7 2015 12:29 AM | Updated on Sep 3 2017 10:32 AM

ఖాతాదారులకంటే బ్యాంకులకే లాభం

ఖాతాదారులకంటే బ్యాంకులకే లాభం

రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్ల కోత ప్రయోజనాలను ఖాతాదారులకు పూర్తి స్థాయిలో బదలాయించడానికి బ్యాంకులు ఇష్టపడటం

వడ్డీ రేట్ల తగ్గింపు తీరుపై ఇండియా రేటింగ్స్ వ్యాఖ్య
 
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్ల కోత ప్రయోజనాలను ఖాతాదారులకు పూర్తి స్థాయిలో బదలాయించడానికి బ్యాంకులు ఇష్టపడటం లేదని, తమ సొంత ప్రయోజనాలకే దీన్ని ఉపయోగించుకుంటున్నాయని ఇండియా రేటింగ్స్ ఆక్షేపించింది.  ఈ ఏడాది జనవరి నుంచి ఆర్‌బీఐ మొత్తం మీద 125 బేసిస్ పాయింట్ల మేర పాలసీ రేట్లను తగ్గించగా.. బ్యాంకులు మాత్రం రుణాలపై వడ్డీ రేట్లను సగటున 50 బేసిస్ పాయింట్లే తగ్గించాయి. కానీ ఏడాది కాల వ్యవధి ఉండే డిపాజిట్ల రేట్లలో మాత్రం ఏకంగా 130 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టాయి.  
 
 
గృహ రుణాలపై ‘స్ప్రెడ్’ పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు:
 కాగా ఎస్‌బీఐ తరహాలోనే ఐసీఐసీఐ బ్యాంకు గృహ రుణాల రేట్లపై ‘స్ప్రెడ్’ను 0.10 శాతం మేర పెంచింది. ఇప్పటిదాకా 0.15 శాతంగా ఉన్న స్ప్రెడ్ .. ఇకపై 0.25 శాతంగా ఉండనుంది. దీని ప్రకారం బ్యాంకు బేస్ రేటు 9.35 శాతంగా ఉండగా.. రూ. 5 కోట్ల కన్నా తక్కువ రుణం తీసుకునే మహిళలు 9.60 శాతం, ఇతర వేతన జీవులు 9.65 శాతం వడ్డీ రేటు కట్టాల్సి ఉంటుంది. గతంలో ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేటు 9.70 శాతంగా ఉన్నప్పుడు మహిళలకు 9.85 శాతానికి రుణం లభించేది. అంటే బేస్ రేటుపై 0.15 శాతం మాత్రమే అధికంగా వడ్డీ రేటు కట్టాల్సి వచ్చేది. తాజా మార్పు ప్రకారం బేస్ రేటుపై 25 శాతం ఎక్కువ కట్టాల్సి రానుంది. బ్యాంకు బేస్ రేటు, కొన్ని విభాగాల్లో అది వసూలు చేసే కనిష్ట వడ్డీ రేటు మధ్య వ్యత్యాసాన్ని స్ప్రెడ్‌గా వ్యవహరిస్తారు. సదరు విభాగంలోని రిస్కును బట్టి బ్యాంకు నిర్ణయిస్తుంది. స్ప్రెడ్‌ను పెంచడం వల్ల బ్యాంకులు తమ నికర వడ్డీ మార్జినల్ను కాపాడుకోవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement