మోదీని కలిసిన గీత | Prime Minister meets Geeta | Sakshi
Sakshi News home page

మోదీని కలిసిన గీత

Oct 26 2015 8:25 PM | Updated on Aug 15 2018 2:20 PM

పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చిన గీత సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.

న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చిన గీత సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లో గీత బాగోగులు చూసుకున్న ఈధీ ఫౌండేషన్‌కు ప్రధాని మోదీ కోటి రూపాయల విరాళం ప్రకటించారు.

గీతను ఆత్మీయంగా హత్తుకున్న మోదీ మాట్లాడుతూ 'స్వాగతం గీత. నువ్వు తిరిగి ఇంటికి చేరుకోవడం నిజంగా ఒక అద్భుతం. ఈ రోజు నీతో కాసేపు మాట్లాడటం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. యావత్ భారతం నీ బాగోగులు చూసుకుంటుంది' అని భరోసా ఇచ్చారు. ఆమె కుటుంబసభ్యులను కనుగొనడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని హామీ ఇచ్చారు. గీత బాగోగులను చూసుకున్న ఈధీ ఫ్యామిలీ ఫౌండేషన్‌కు మోదీ కృతజ్ఞతలు చెప్పారు. కరుణ, దయకు ఆ సంస్థ ప్రతీక అని అభివర్ణించారు.

Advertisement
 
Advertisement
Advertisement