ప్రవీణ్ తొగాడియాపై కర్ణాటకలో నిషేధం | Praveen togadia ban on karnataka state | Sakshi
Sakshi News home page

ప్రవీణ్ తొగాడియాపై కర్ణాటకలో నిషేధం

Mar 7 2015 7:59 PM | Updated on Sep 2 2017 10:28 PM

ప్రవీణ్ తొగాడియాపై కర్ణాటకలో నిషేధం

ప్రవీణ్ తొగాడియాపై కర్ణాటకలో నిషేధం

విశ్వ హిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియాను కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఆ రాష్ట్ర హోం శాఖ శనివారం నిషేధం విధించింది.

బెంగళూరు: విశ్వ హిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియాను కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఆ రాష్ట్ర హోం శాఖ శనివారం నిషేధం విధించింది. ఈ నెల 9 నుంచి 13 వరకు ఉడుపిలో జరిగే ఓ కార్యక్రమానికి తొగాడియా ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆయన ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు ఉడుపి జిల్లా ఎస్పీ అన్నామలై విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement