డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ రాహుల్! | Pratyusha boyfriend Rahul booked for drunk driving | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ రాహుల్!

Sep 19 2016 4:56 PM | Updated on May 25 2018 2:06 PM

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ రాహుల్! - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ రాహుల్!

ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బేనర్జీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు.

ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బేనర్జీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. మద్యం తాగి వాహనాన్ని నడుపుతుండగా అతన్ని పోలీసులు బుక్ చేశారు. శనివారం రాత్రి ముంబైలోని శాంటాక్రజ్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రాహుల్ వాహనం నడుపుతూ వచ్చాడు. అతని వెంట మాజీ ప్రియురాలు సలోని శర్మ కూడా ఉంది.

అయితే, అతడు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అతని వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని శాంటాక్రజ్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే, ఈ సమయంలో అతని వెంట సలోని శర్మ పోలీసులపై బెదిరింపులకు దిగినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. తమను విడిచిపెట్టకుంటే పైఅధికారులకు ఫిర్యాదు చేసి.. మీకు తగిన శాస్తి చేస్తామని ఆమె హెచ్చరించిందని వివరించారు.

'బాలికా వధు' సీరియల్ హీరోయిన్ అయిన ప్రత్యూష బేనర్జీ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్టు రాహుల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతని మాజీ ప్రియురాలు సలోనీ శర్మ కూడా ఈ కేసులో తన పాత్రపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement