నబా జైలు ఘటనలో విషాదం | police shoots on car, woman dies in punjab | Sakshi
Sakshi News home page

నబా జైలు ఘటనలో విషాదం

Nov 27 2016 3:38 PM | Updated on Sep 4 2017 9:17 PM

నబా జైలు ఘటనలో విషాదం

నబా జైలు ఘటనలో విషాదం

పంజాబ్‌లోని నబా జైలు ఘటనలో విషాదం చోటు చేసుకుంది.

 చండీగఢ్‌: పంజాబ్‌లోని నబా జైలు ఘటనలో విషాదం చోటు చేసుకుంది. ఓ పికెట్‌ వద్ద ఆపకుండా వెళ్లిన కారుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ఆదివారం నబా జైలుపై 10మంది సాయుధులు దాడి చేసి.. ఖలీస్థాన్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్మిందర్‌ సింగ్‌ అలియాస్‌ మింటూతో పాటు మరో నలుగురిని విడిపించుకొని తీసుకెళ్లారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర‍్యలు చేపట్టారు. జైలు నుంచి సుమారు 50 కిలో మీటర్ల పరిధిలో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఓ పికెట్‌ వద్ద కారు ఆపకుండా వెళ్లడంతో పోలీసులు కాల్పులు జరిపారు.

Advertisement
 
Advertisement
Advertisement