కాపు సత్యాగ్రహ యాత్రకు చుక్కెదురు! | police break to kapu satyagraha yatra | Sakshi
Sakshi News home page

కాపు సత్యాగ్రహ యాత్రకు చుక్కెదురు!

Jan 21 2017 3:57 PM | Updated on Jul 30 2018 6:25 PM

కాపు సత్యాగ్రహ యాత్రకు చుక్కెదురు! - Sakshi

కాపు సత్యాగ్రహ యాత్రకు చుక్కెదురు!

రిజర్వేషన్ల సాధన కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రకు ఏపీ ప్రభుత్వం నుంచి చుక్కెదురైంది.

  • అనుమతి లేదన్న ఎస్పీ
     
  • కాకినాడ: రిజర్వేషన్ల సాధన కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రకు ఏపీ ప్రభుత్వం నుంచి చుక్కెదురైంది. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఈ నెల 25నుంచి ఆరు రోజుల పాటు తలపెట్టిన ఈ యాత్రకు అనుమతి లేదని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ తెలిపారు. గత సంఘటనల నేపథ్యంలో సత్యాగ్రహ యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాదయాత్రకు కూడా యాన పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని ఎస్పీ రవిప్రకాశ్‌ శనివారం విలేకరులతో చెప్పారు.

    తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి కాపు సత్యాగ్రహ యాత్రను ప్రారంభించాలని ముద్రగడ పద్మనాభం నిర్ణయించారు. అక్కడి నుంచి అమలాపురం మీదగా అంతర్వేది వరకు ఆయన యాత్ర తలపెట్టారు. గాంధేయ మార్గంలోనే ఈ సత్యాగ్రహ యాత్రను నిర్వహిస్తామని, కాపులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయించేందుకే యాత్ర చేస్తున్నామని ఆయన గతంలో స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement