తీవ్ర విషాదానికి ముందు.. | Pics of last happy moments of ChapecoenseReal players before tragic | Sakshi
Sakshi News home page

తీవ్ర విషాదానికి ముందు..

Dec 1 2016 9:00 AM | Updated on Oct 2 2018 8:39 PM

తీవ్ర విషాదానికి ముందు.. - Sakshi

తీవ్ర విషాదానికి ముందు..

ఏ నిమిషానికి ఏమి జరుగునో..ఎవరూహించెదరు.. అన్నట్టుగా వారి సంతోష క్షణాలతో నిండిన ఫోటోలు మరింత విషాదాన్ని నింపాయి.

తీవ్ర విషాదాన్ని నింపిన బ్రెజిల్‌ ఫుట్‌ బాల్‌ దేశీయ క్రీడాకారుల ఆకస్మిక మరణంతో యావత్ ప్రపంచ క్రీడాకారులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉత్సాహంతో ఉరకలెత్తుతూ బయలుదేరిన  బ్రెజిల్ చాపెకో ఎన్సో ఫుట్ బాల్  క్రీడాకారులు అంతలోనే  అసువులు బాయడం పెను విషాదాన్ని నింపింది.  కొలంబియాలో జరుగుతున్న కోపా సుడామెరికా ఫైనల్స్లో పాల్గొనేందుకు  విమానం ఎక్కడానికి ముందు   ఫుట్  బాల్ టీం  సంతోషంగా తీసుకున్న ఫోటోలు చూసి  మృతుల బంధువులు, సన్నిహితులు  బావురుమన్నారు.  ఏ నిమిషానికి ఏమి జరుగునో..ఎవరూహించెదరు.. అన్నట్టుగా వారి సంతోష క్షణాలతో నిండిన ఫోటోలు మరింత విషాదాన్ని నింపాయి. అలాగే ఫైనల్ కు చేరిన సందర్భంగా టీం ఆనందంగా గడిపిన వీడియో ఒకటి నెట్ లో ఎక్కువగా షేర్ అవుతోంది.

 ఆ దేశవిమానయాన శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ విమానంలో తొమ్మిదిమంది విమాన సిబ్బంది సహా ఇతర కోచ్ లు,  ముఖ్య అతిధులు, జర్నలిస్టులు మొత్తం 81 మంది  ఉన్నారు.  సీపీ 2933 అనే ఈ చార్టెడ్‌ విమానం కొలంబియా నగరం వెలుపల ఉన్న పర్వత ప్రాంతాల్లో కూలిపోవడంతో దాదాపు మొత్తం టీం ప్రాణాలు కోల్పోగా , ముగ్గురు  సాకర్ టీం సభ్యులు, ఇద్దరు విమాన సిబ్బంది, ఒక జర్నలిస్టు ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు  బ్లాక్ బాక్స్ లో వాయిస్ రికార్డర్  లో  ఇంధనం అయిపోయిందన్న పైలట్  మాటలను గుర్తించినట్టు బీబీసీ రిపోర్ట్ చేసింది. 

కాగా ఫుట్‌ బాల్‌ క్రీడాకారుల ఆకస్మిక మరణంతో బ్రెజిల్ లో మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తున్న సంగతి తెలిసిందే.









Advertisement
 
Advertisement
Advertisement