ప్యానాసోనిక్ వియరా టీవీలపై వినూత్నమైన ఆఫర్లు | panasonic viera special offers | Sakshi
Sakshi News home page

ప్యానాసోనిక్ వియరా టీవీలపై వినూత్నమైన ఆఫర్లు

Aug 21 2013 2:51 AM | Updated on Sep 1 2017 9:56 PM

ప్యానాసోనిక్ వియరా టీవీలపై వినూత్నమైన ఆఫర్లు

ప్యానాసోనిక్ వియరా టీవీలపై వినూత్నమైన ఆఫర్లు

పండుగల సీజన్ సందర్భంగా రాష్ట్ర వినియోగదారులకు వియరా టీవీలపై వినూత్న ఆఫర్లను అందిస్తున్నామని పానాసానిక్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్: పండుగల సీజన్ సందర్భంగా రాష్ట్ర వినియోగదారులకు వియరా టీవీలపై వినూత్న ఆఫర్లను అందిస్తున్నామని పానాసానిక్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఫ్లాట్‌ప్యానెల్ సెగ్మెంట్లో ప్రస్తుతం 9 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను 15 శాతానికి పెంచుకోవడం లక్ష్యంగా అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన వియరా టీవీలను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ రీజనల్ మేనేజర్ ప్రసాదరెడ్డి పేర్కొన్నారు.  కేవలం రూ.1,947 మాత్రమే చెల్లించి వియరా టీవీలను కొనుగోలు చేయవచ్చని మిగిలిన మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చని తెలిపారు.
 
  39 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ కొనుగోలుపై రూ. 5,990 విలువ గల స్పీకర్‌ను, 29 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ కొనుగోలుపై రూ.1,990 విలువైన బెనెటన్ బ్యాగ్‌ను ఉచితంగా ఇస్తామని, మూడేళ్ల వారంటీని కూడా ఆఫర్ చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్, రాజమండ్రి, వైజాగ్, తిరుపతిల్లోని తమ పానాసానిక్ బ్రాండ్ షాపుల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వినియోగదారులను అలరించే ఆధునిక ఫీచర్లతో 22 నుంచి 60 అంగుళాల వియరా టీవీలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటి ధరలు రూ. 14,900 నుంచి రూ.1,95,000 రేంజ్‌లో ఉన్నాయని వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement