హలో మోదీగారూ.. నేను షరీఫ్ని | Pakistan Prime Minister Nawaz Sharif calls up Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

హలో మోదీగారూ.. నేను షరీఫ్ని

Apr 30 2015 12:06 PM | Updated on Aug 15 2018 6:34 PM

హలో మోదీగారూ.. నేను షరీఫ్ని - Sakshi

హలో మోదీగారూ.. నేను షరీఫ్ని

ప్రధాని నరేంద్రమోదీకి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సర్ ప్రైజ్ పోన్ కాల్ చేశారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సర్ ప్రైజ్ పోన్ కాల్ చేశారు. భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన భారతీయుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేపాల్లో భూకంప బాధితులకు సేవలు అందించడంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న భారత్పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.

నేపాల్ కు మీరు అందిస్తున్న సేవలు చాలా గొప్పవంటూ మోదీని కొనియాడారు. గురువారం ఉదయాన్నే సర్ ప్రైజ్గా మోదీకి షరీఫ్ ఫోన్ చేశారు. సాధారణంగా ప్రత్యేక సందర్భాల్లో తప్ప భారత్ పాక్ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడవని విషయం తెలిసిందే. నేపాల్కు సహాయం అందించడంలో భారత్ ముందుడటాన్ని ఒక్కపాకిస్థానే కాకుండా ప్రపంచం మొత్తం గుర్తించింది.

Advertisement
 
Advertisement
Advertisement