సిరియాలో 7,219 మంది మృత్యువాత | Over 7,200 killed in Syria in August | Sakshi
Sakshi News home page

సిరియాలో 7,219 మంది మృత్యువాత

Sep 3 2014 10:35 AM | Updated on Sep 2 2017 12:49 PM

అంతర్యుద్ధంతో అట్టుకుతున్న సిరియాలో నరమేధం కొనసాగుతోంది.

కైరో: అంతర్యుద్ధంతో అట్టుకుతున్న సిరియాలో నరమేధం కొనసాగుతోంది. ఒక్క ఆగస్టు నెలలోనే సిరియాలో 7,219 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో  2,015 మంది పౌరులు, 281 మంది పిల్లలు, 138 మంది మహిళలు ఉన్నారని మానవ హక్కుల సంస్థ ఒకటి వెల్లడించింది.

ఫ్రీ సిరియన్ ఆర్మీ(ఎఫ్ఎస్ఏ), తిరుగుబాటుదారులు, ప్రభుత్వ వ్యతిరేకదళాలను చెందిన 1,448 మంది మృతి చెందారని పేర్కొంది. షుయ్టాట్ గిరిజన  తెగకు చెందిన 700 మంది కూడా మృతుల్లో ఉన్నారు. గత మూడేళ్ల నుంచి ఈ దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement