లాహోర్లో 113 రేప్ కేసులు నమోదు | Over 100 rape cases filed in Lahore in 2013 | Sakshi
Sakshi News home page

లాహోర్లో 113 రేప్ కేసులు నమోదు

Sep 15 2013 2:37 PM | Updated on Jul 28 2018 8:40 PM

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు లాహోర్ మహానగరంలో 113 అత్యాచార కేసులు నమోదు అయ్యాయని స్థానిక పత్రిక డ్వాన్ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు లాహోర్ మహానగరంలో 113 అత్యాచార కేసులు నమోదు అయ్యాయని స్థానిక పత్రిక  డ్వాన్ ఆదివారం వెల్లడించింది. అయా కేసులకు సంబంధించిన గణాంకాలను సోదాహారణగా ఆ పత్రిక వివరించింది. ఆ కేసుల్లో దాదాపు 86 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపింది.

 

గత ఎనిమిది నెలల్లో 32 సామూహిక అత్యాచార సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పింది. ఆ కేసులతో ప్రమేయం ఉన్న 22 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. అయితే అత్యాచారానికి గురైన మహిళలంతా యుక్తవయస్సువారేనని డ్వాన్ పత్రిక ఆదివారం ప్రచురించిన కథనంలో వెల్లడించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement