తెలంగాణ స్టూడెంట్స్ ప్రజా పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు దరఖాస్తు చేశారు.
న్యూఢిల్లీ: తెలంగాణ స్టూడెంట్స్ ప్రజా పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు దరఖాస్తు చేశారు. విద్యార్థుల త్యాగాలను టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలు తమకు అనుకూలంగా మలుచుకుని గెలవాలని చూస్తున్నాయని ఓయూ విద్యార్థి నాయకుడు కరాటే రాజు ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక ఏర్పడ్డాక ఈ పార్టీలను తరిమికొడతామని ఆయన హెచ్చరించారు.
బంగారు తెలంగాణను తామే నిర్మించుకుంటామన్నారు. జనవరి 20న 5 లక్షల మంది విద్యార్థులతో తెలంగాణ స్టూడెంట్స్ ప్రజా పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామని కరాటే రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా విద్యార్థి ఉద్యమం నడుస్తుందన్నారు.