అప్పో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ | Oppo launches A57 with 16MP front camera at Rs 14,990 | Sakshi
Sakshi News home page

అప్పో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

Jan 31 2017 7:27 PM | Updated on Sep 5 2017 2:34 AM

అప్పో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

అప్పో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

ప్రముఖ మొబైల్ మేకర్‌ అప్పో తనకొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

బెంగళూరు:  ప్రముఖ మొబైల్ మేకర్‌  అప్పో తనకొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అతి పెద్ద  బ్యాటరీతో  ఎ 57 పేరుతో  మంగళవారం లాంచ్ చేసిన ఈ ఫ్లాగ్ షిప్‌ మొబైల్ ధరను కంపెనీ రూ. 14,990గా నిర్ణయించింది.   అతి తక్కువ  లైటింగ్ కండిషన్స్ లో అద్భ తమైన ఫోటోలకు తీసి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫ్రింగర్ ప్రింట్ రీడర్  దీని ప్రత్యేకతలుగా చైనీస్ స్మార్ట్ఫోన్ ఫోన్  అప్పో చెబుతోంది.  ఫిబ్రవరి 3 నుంచి ఇది వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.  అప్పో స్టోర్లు, ఆన్ లైన్ స్టోర్లు అమెజాన్,  ఫ్లిప్ కార్ట్,  స్నాప్ డీల్  ద్వారా   విక్రయించనున్నారు.   
 
ప్రీమియం ఫోటోగ్రఫీ,   ఫ్రింగర్ ప్రింట్ రీడర్ వంటి ఆధునిక ఫీచర్లతోదీన్ని అందుబాటులోకి తెచ్చినట్టు అప్పో  వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ స్కై లీ చెప్పారు.  ఫింగర్ తడిగా వున్న కూడా  అత్యాధునిక హైడ్రోఫోబిక్  జిర్కోనియం  సహాయంతో  సెన్సర్ పనిచేస్తుందని చెప్పారు.

ఫీచర్లు
5.2 అంగుళాల  
సోనీ ఐఎంఎక్స్ 258 సెన్సార్
0.1 సెకండ్లో  అల్ట్రా-హెచ్ డి  ఆటో ఫోకస్,
గొరిల్లా గ్లాస్
ఆండ్రాయిడ్ 6.0 , ఆక్టాకోర్ ప్రాసెసర్ మరియు
3జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
13ఎంపీ వెనుక కెమెరా
2900 ఎంఏహెచ్ బ్యాటరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement