జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు బంద్ | No internet connectivity in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు బంద్

Aug 11 2013 9:38 AM | Updated on Sep 1 2017 9:47 PM

జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు ఆదివారం శ్రీనగర్లో వెల్లడించారు.

జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు ఆదివారం శ్రీనగర్లో వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో పుకార్లు షికార్లు చేసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కిష్ట్‌వార్ జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన మత  ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

ఈ ఘటనలో 20 మందికిపైగా గాయపడ్డారు. దీంతో ఆ జిల్లాతోపాటు మరో రెండు జిల్లాల్లో కర్ఫ్యూ నిరంతరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఘర్షణ చెలరేగే అవకాశం ఉండదిని నిఘా సమాచారం మేరకు ముందస్తూ చర్యల్లో భాగంగా ఉధ్దంపుర్ జిల్లాలో ఆదికారులు ఆదివారం కర్ప్యూ విధించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement