ట్రంప్ ఎఫెక్ట్: 3 లక్షల మంది ఎన్నారైలు ఇంటికే!
తగిన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న దాదాపు కోటి మందికి పైగా వలసదారులను వాళ్ల వాళ్ల దేశాలకు తిప్పి పంపేయాలన్న ట్రంప్ నిర్ణయంతో దాదాపు 3 లక్షల మంది భారతీయ అమెరికన్లపై ప్రభావం పడుతుంది.
తగిన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న దాదాపు కోటి మందికి పైగా వలసదారులను వాళ్ల వాళ్ల దేశాలకు తిప్పి పంపేయాలన్న ట్రంప్ నిర్ణయంతో దాదాపు 3 లక్షల మంది భారతీయ అమెరికన్లపై ప్రభావం పడుతుంది. తగిన పత్రాలు లేకుండా వలస వచ్చినవాళ్లపై వేటు వేసేందుకు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలును గణనీయంగా మారుస్తున్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా ఉంటున్నవాళ్లను ఏరి పారేయడంలో తమ శాఖ ఇక ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించినట్లు తేలిన ఎవరినైనా అరెస్టు చేయడానికి లేదా అదుపులోకి తీసుకోడానికి తమ శాఖ సిబ్బందికి పూర్తి అధికారాలు ఉంటాయని చెప్పింది. ఇప్పటికే డీహెచ్ఎస్ రెండు ఎన్‌ఫోర్స్‌మెంట్ మెమోలను జారీచేసింది. వాటి ప్రకారం అక్రమ వలసదారులను వెంటనే తమ దేశాలకు పంపించేందుకు వీలుంటుంది. ప్రధానంగా నేరస్తుల మీదే ఇది దృష్టిపెడుతున్నా, ఇతరులకూ వర్తిస్తుంది.
దాదాపు 3 లక్షల మంది వరకు భారతీయులు ఇలా తగిన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. వీళ్లందరికీ కూడా ఈ కొత్త నిబంధనలతో ముప్పు తప్పదు. వాళ్లంతా వెనక్కి తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మైనర్లు గానీ, ఆశ్రయం పొందిన వారు గానీ, లేదా సొంత దేశంలో ఏవైనా చిత్రహింసలు అనుభవిస్తామన్న భయంతో ఉంటున్నవాళ్లు.. ఇలాంటి వాళ్లకు మాత్రం కొంతవరకు మినహాయింపు లభిస్తుందని చెబుతున్నారు.