ప్రియాంక చోప్రాను చంపేస్తా: హీరో | Neither marry nor hook up, Shahid wants to kill Priyanka | Sakshi
Sakshi News home page

ప్రియాంక చోప్రాను చంపేస్తా: హీరో

Jan 2 2017 2:39 PM | Updated on Sep 5 2017 12:12 AM

ప్రియాంక చోప్రాను చంపేస్తా: హీరో

ప్రియాంక చోప్రాను చంపేస్తా: హీరో

కరణ్‌ జోహార్‌ సెలబ్రిటీ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ తాజా ఎపిసోడ్‌ హాట్‌ హాట్‌గా సాగింది.

ముంబై: కరణ్‌ జోహార్‌ సెలబ్రిటీ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ తాజా ఎపిసోడ్‌ హాట్‌ హాట్‌గా సాగింది. ఈ షోలో పాల్గొన్న  షాహిద్‌ కపూర్‌,  మీరా రాజ్‌పుత్‌ దంపతులు బోల్డ్‌గా తమ మనోభావాలను వ్యక్తం చేసి.. ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా కరణ్‌ అడిగిన ఫటాఫట్‌ ప్రశ్నలకు ఈ జోడీ చాలా సరదాగా, ఓపెన్ గా సమాధానం చెప్పింది.

షోలో భాగంగా కిల్‌-మ్యారీ-హుకప్‌ గేమ్‌లో భాగంగా సోనాక్షిసిన్హా, అలియా భట్‌, ప్రియాంకచోప్రాలలో ఎవరినీ చంపేస్తావు, ఎవరిని పెళ్లిచేసుకుంటావు, ఎవరితో ఎఫైర్‌ పెట్టుకుంటావు అని కరణ్‌ అడుగగా.. మరో ఆలోచన లేకుండా ప్రియాంకను చంపేస్తానని షాహిద్‌ బదులిచ్చాడు. సోనాక్షిని పెళ్లి చేసుకుంటానని, తాను పెళ్లికి అనువుగా ఉంటుందని చెప్పాడు. అలియాతో రిలేషన్‌షిప్‌ పెట్టుకోవడం చాలా క్షేమం కాబట్టి తనతో హుకప్‌ అవుతానని చెప్పాడు.

ఇక ద్రోహం, అత్తింటివారి జోక్యం, బ్యాడ్‌ సెక్స్‌, బోర్‌డమ్‌ ఈ నాలుగింటిలో మీ వివాహబంధం విచ్ఛిన్నానికి దారితీయడానికి అవకాశమున్న అంశాలు ఏమిటి అని..  మీరాను కరణ్‌ అడుగగా.. ’మా అత్తింటివారు మంచి వారు. బోర్‌ అన్న ప్రసక్తే లేదు. చెడు శృంగారం జోలికి మేం వెళ్లబోం. కాబట్టి అది ఛీటింగ్‌ కావొచ్చు’ అంటూ  మీరా సమాధానమిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement