బుల్లెట్‌ రైలు నడిపిన ప్రధాని మోదీ | narendramodi takes a look inside the driver's cabin of the bullet train | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ రైలు నడిపిన ప్రధాని మోదీ

Nov 12 2016 11:59 AM | Updated on Aug 15 2018 6:34 PM

బుల్లెట్‌ రైలు నడిపిన ప్రధాని మోదీ - Sakshi

బుల్లెట్‌ రైలు నడిపిన ప్రధాని మోదీ

జపాన్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఒప్పందాలు చేసుకున్నారు.

టోక్యో: జపాన్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఒప్పందాలు చేసుకున్నారు. జపాన్‌ పారిశ్రామిక రంగంలో భారత్‌ కీలక భాగస్వామ్యం కోరుకుంటోందని, దీనివల్ల ఇరు దేశాలకు లాభదాయకమని మోదీ చెప్పారు. శనివారం కొబెలో మోదీ జపాన్‌ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. 2007, 2012లో ఇక్కడ పర‍్యటించానని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు.

జపాన్‌ ప్రధాని షింజో అబెతో కలిసి మోదీ టోక్యో నుంచి కొబెకు హై స్పీడ్‌ రైల్లో ప్రయాణించారు. రైల్లో మోదీ, అబె ఇద్దరూ కలసి డ్రైవర్‌ క్యాబిన్‌లోకి వెళ్లారు. మోదీ కాసేపు డ్రైవర్‌ సీట్లో కూర్చుని ఆపరేట్‌ చేశారు. కొబెలో ప్రధాని మోదీ వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులతో భేటీ అయ్యారు. మోదీ, అబె సమక్షంలో గుజరాత్‌, హ్యోగో ప్రభుత్వాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement