పనికిమాలిన చట్టాలను తొలగిస్తాం:మోడీ | narendra modi's government try to remove no using acts | Sakshi
Sakshi News home page

పనికిమాలిన చట్టాలను తొలగిస్తాం:మోడీ

Sep 23 2014 6:36 PM | Updated on Apr 4 2019 3:25 PM

పనికిమాలిన చట్టాలను తొలగిస్తాం:మోడీ - Sakshi

పనికిమాలిన చట్టాలను తొలగిస్తాం:మోడీ

దేశంలో అవసరం లేని చట్టాలను తొలగించే పనిలో పడ్డామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

బెంగళూరు:దేశంలో అవసరం లేని చట్టాలను తొలగించే పనిలో పడ్డామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఏ ఉపయోగమూ లేని చట్టాలను తొలగించేందుకు కసరత్తులు ఆరంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచే పని మొదలు పెడతామన్నారు. జన్ ధన్ యోజన కింద 4 కోట్ల మందికి పేదలు ఖాతాలు తెరిచారన్నారు.  బ్యాంకులు ధనికోసమే కాదని.. పేదల కోసం కూడా అని మోడీ పేర్కొన్నారు.
 

సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అమెరికాకు చెందిన ఆరు కంపెనీల సీఈవోలతో మోడీ సమావేశం కానున్నారు.  ఈనెల 27న ఐక్యరాజ్యసమితిలో జరిగే సర్వసభ్య సమావేశంలో మోడీ హిందీలో ప్రసంగించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 29, 30 తేదిల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నరేంద్రమోడీ భేటీ అవుతారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement