'అవినీతిపై కాంగ్రెస్ సమాధానం చెప్పలేదు' | Narendra Modi takes on Congress party | Sakshi
Sakshi News home page

'అవినీతిపై కాంగ్రెస్ సమాధానం చెప్పలేదు'

Apr 10 2014 11:49 AM | Updated on Mar 18 2019 7:55 PM

'అవినీతిపై కాంగ్రెస్ సమాధానం చెప్పలేదు' - Sakshi

'అవినీతిపై కాంగ్రెస్ సమాధానం చెప్పలేదు'

రానున్న ఎన్నికలలో బీజేపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

రానున్న ఎన్నికలలో బీజేపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. గురువారం పశ్చిమబెంగాల్ సిలిగురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీపై మోడీ నిప్పులు చెరిగారు.

 

10 ఏళ్ల యూపీఏ పాలనలో దేశంలో అవినీతి పెచ్చురిల్లిందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై విపక్షాలు ప్రశ్నిస్తే కాంగ్రెస్ మాత్రం మీనమేషాలు లెక్కిస్తుందని విమర్శించారు. దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని నిర్మూలించాల్సిన అవశ్యకతను మోడీ ఈ సందర్బంగా విశదీకరించారు. దేశం వెనకబాటుతనానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ఆరోపించారు. బీజేపీతోనే భారత్ నవనిర్మాణం సాధ్యమని మోడీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement