
మోడీ మంచి ప్రధాని అభ్యర్థి: అయ్యర్
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికైన నరేంద్ర మోడీకి ప్రముఖ న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఆర్ కృష్ణ అయ్యర్ మద్దతు ప్రకటించారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికైన నరేంద్ర మోడీకి ప్రముఖ న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఆర్ కృష్ణ అయ్యర్ మద్దతు ప్రకటించారు. ప్రధాని అభ్యర్థిగా మోడీ తగినవారని అన్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో 'నమో' విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయత, సౌహార్థం వంటి సానుకూల లక్షణాలు మోడీకి ఉన్నాయని తెలిపారు.
మనదేశానికి అణు విద్యుత్ అవసరం లేదని అయ్యర్ అభిప్రాయపడ్డారు. సోలార్ విద్యుత్ను సవ్యంగా వినియోగించుకుంటే చాలని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్కు మోడీ ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. గుజరాత్ స్థాయిలో మరే రాష్ట్రం కూడా సోలార్ విద్యుత్ను వినియోగించుకోవడం లేదని తెలిపారు. అవినీతి నిర్మూలనకు గుజరాత్లో నరేంద్ర మోడీ చేసిన కృషిని అయ్యర్ ప్రశంసించారు.