సుమిత్రా మహాజన్ కు మోడీ అభినందనలు | narendra Modi congratulates Sumitra Mahajan on being elected speaker | Sakshi
Sakshi News home page

సుమిత్రా మహాజన్ కు మోడీ అభినందనలు

Jun 6 2014 2:25 PM | Updated on Mar 29 2019 9:24 PM

సుమిత్రా మహాజన్ కు మోడీ అభినందనలు - Sakshi

సుమిత్రా మహాజన్ కు మోడీ అభినందనలు

తాజా లోక్ సభకు స్పీకర్ గా ఎన్నికైన సుమిత్రా మహాజన్ కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు.

న్యూఢిల్లీ: తాజా లోక్ సభకు స్పీకర్ గా ఎన్నికైన సుమిత్రా మహాజన్ కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. 16 వ లోక్ సభకు స్పీకర్ గా నియమించబడ్డ సుమిత్ర నియామకం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు గర్వకారణమన్నారు. మహిళలు పార్లమెంట్ లో ఉన్నతస్థాయి పదవిని అలకరించడం నిజంగానే ఆనందించదగ్గ విషయని మోడీ తెలిపారు.  ఈ సందర్భంగా ఆమెకు ప్రధాని కార్యాలయం ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపింది.
 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నేతలు 16వ లోక్‌సభ స్పీకర్‌గా మహాజన్ పేరును ప్రతిపాదించగా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. శుక్రవారం ఆమె స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిది సార్లు ఇండోర్ నుంచి ఎంపికైన సుమిత్రా మహాజన్ లోక్సభకు రెండో మహిళా స్పీకర్ కావటం విశేషం. లోక్ సభ స్పీకర్ పదవి కోసం గురువారం మధ్యాహ్నంలోగా నామినేషన్లు దాఖలు చేయూల్సి ఉండగా.. ఆ గడువులోగా కేవలం సుమిత్రా మహాజన్ పేరుకు మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయి. దాంతో ఆమె ఎన్నిక లాంఛనప్రాయమే అయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement