ఒబామాకు మోదీ ‘వీడ్కోలు’ట్వీట్ | Narendra Modi bids Obama farewell | Sakshi
Sakshi News home page

ఒబామాకు మోదీ ‘వీడ్కోలు’ట్వీట్

Jan 27 2015 4:16 PM | Updated on Aug 15 2018 2:12 PM

ఒబామాకు మోదీ ‘వీడ్కోలు’ట్వీట్ - Sakshi

ఒబామాకు మోదీ ‘వీడ్కోలు’ట్వీట్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత్ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత్ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఒబామా భారత్ పర్యటన ముగించుకొని సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లగానే మోదీ సామాజిక వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ఇదే మీకు వీడ్కోలు. మీ పర్యటన భారత్, అమెరికా సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లెంది. మీ ప్రయాణం క్షేమంగా సాగాలని కోరుకుంటున్నాను’ అని మోదీ వ్యాఖ్యానించారు.

అమెరికా వైట్‌హౌస్ కూడా ఇదే రీతిలో స్పందించింది. ఒబామా భారత్ పర్యటన ఓ మధుర జ్ఞాపకంగా మిగిలి పోతుందని, తమకందించిన స్వాగత, సత్కారాలకు భారతీయులకు, మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. దీనిపై మోదీ స్పందిస్తూ మళ్లీ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ పరేడ్ సందర్భంగా వర్షం పడుతుంటే ఒబామా స్వయంగా తానే గొడుకు పట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ ‘బడే బడే దేశంమే ఐసీ చోటే చోటే బాతే హోతీ రహతే హై’ అంటూ సందర్భోచితంగా ఒబామా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement