'నారాయణ' విద్యార్ధి ఆత్మహత్యాయత్నం | narayana college student commits suicide attempt | Sakshi
Sakshi News home page

'నారాయణ' విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

Sep 30 2015 12:34 PM | Updated on Nov 9 2018 5:02 PM

'నారాయణ' విద్యార్ధి ఆత్మహత్యాయత్నం - Sakshi

'నారాయణ' విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

కళాశాల లెక్చరర్లు ఒత్తిడి పెట్టడంతో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన అనంతపురం పట్టణంలో బుధవారం జరిగింది.

అనంతపురం: కళాశాల లెక్చరర్లు ఒత్తిడి పెట్టడంతో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన అనంతపురం పట్టణంలో బుధవారం జరిగింది. భరత్‌కుమార్ అనే విద్యార్థి అనంతపురంలోని నారాయణ కాలేజ్ లో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. చదువుకోసం లెక్చరర్లు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక బుధవారం ఉదయం తన ఇంటిలో ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో తల్లిదండ్రులు గుర్తించి అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

కళాశాలపై బాధిత బంధువుల దాడి
విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై ఆగ్రహం చెందిన విద్యార్ధి బంధువులు, విద్యార్ధి సంఘాలు కళాశాలపై దాడి చేశాయి. ఫర్నీచర్‌ను విరగొట్టారు. ఇది ఇలావుండగా ఆసుపత్రిలో విద్యార్థి తన ఆత్మహత్యాయత్నానికి కాలేజీ లెక్చర్‌ర్ల ఒత్తిడే కారణమని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే కాలేజీ యాజమాన్యానికి అనుకూలంగా ఆ స్టేట్‌మెంట్ ను మార్చారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఆగ్రహం చెందిన వారు కళాశాల ముందు ఆందోళనకు దిగారు.
 

Advertisement
 
Advertisement
Advertisement