నేడు ముజఫర్నగర్లో పర్యటించనున్న అఖిలేష్ | Muzaffarnagar: Akhilesh Yadav to visit today | Sakshi
Sakshi News home page

నేడు ముజఫర్నగర్లో పర్యటించనున్న అఖిలేష్

Sep 15 2013 11:24 AM | Updated on Sep 1 2017 10:45 PM

ఇటీవల అల్లర్లతో అట్టుడికి, ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న ముజఫర్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఆదివారం పర్యటించనున్నారు.

ఇటీవల అల్లర్లతో అట్టుడికి, ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న ముజఫర్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఆదివారం పర్యటించనున్నారు. ఆ అల్లర్లలో గాయపడి ముజఫర్నగర్లోని పలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వందలాది మంది క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. అనంతరం ముజఫర్నగర్లో శాంతి భద్రతలపై ఆ జిల్లా ఉన్నతాధికారులతో అఖిలేష్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

 

అలాగే ముజఫర్నగర్లో సోమవారం మన్మోహన్ సింగ్ పర్యటించనున్నారు. ఆయనతోపాటు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పర్యటిస్తారు. ఇటీవల ముజఫర్ నగర్లో హిందువుల్లోని జాట్ తెగకు ముస్లిం మతస్థుల మధ్య చోటు చేసుకున్న చిన్న సంఘటన చినికిచినికి గాలివానగా మారింది.ఆ ఘర్షణలో దాదాపు 48 మంది మరణించగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement