 
															వంతెన దాటబోయాడు.. వరదలో కొట్టుకుపోయాడు!
													 
										
					
					
					
																							
											
						 అత్యుత్సాహం ఓ యువకుడి ప్రాణాల మీదకొచ్చింది.
						 
										
					
					
																
	అత్యుత్సాహం ఓ యువకుడి ప్రాణాల మీదకొచ్చింది. దాటగలనన్న ధీమా, దాటే ప్రయత్నానికి మధ్య తీసుకోవాల్సిన చిన్న నిర్ణయంలో తొందరపడ్డాడు.  ఫలితంగా భారీ వరదల్లో కొట్టుకుపోయాడు. మధ్యప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఈ భారీ వరదల్లో ఓ యువకుడు కొట్టుకుపోయిన సంఘటన బేతుల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అప్పటికే విపరీతమైన ఉధృతితో పొంగుతున్న ఓ నది వంతెనపై బైక్‌పై వెళ్లడానికి సిద్ధంగా ఉన్న యువకుడు.. వరద ప్రవాహాన్ని తక్కువ అంచనా వేశాడు.
	 
	 
	ముందు కాస్త తటపటాయించినా ఆ తర్వాత అనాలోచితంగా బైక్‌ని ముందుకు పోనిచ్చాడు. క్షణాల్లో ముంచెత్తిన వరదతో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. ఆ తర్వాత ఎక్కడా అతడి జాడ తెలియకపోవడంతో అతను చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.