తల్లి ప్రియుడ్ని హతమార్చిన తనయుడు | Mother's lover killed by son | Sakshi
Sakshi News home page

తల్లి ప్రియుడ్ని హతమార్చిన తనయుడు

Feb 2 2016 8:11 AM | Updated on Sep 3 2017 4:46 PM

తల్లి ప్రియుడ్ని హతమార్చిన తనయుడు

తల్లి ప్రియుడ్ని హతమార్చిన తనయుడు

తల్లితో పాటు ఉన్న ప్రియుడ్ని ఆమె తనయుడు హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

టీనగర్: తల్లితో పాటు ఉన్న ప్రియుడ్ని ఆమె తనయుడు హతమార్చాడు. తిరుపూరు జిల్లా, ఉడుమలై సమీపానగల దేవనూరు పుదూరుకు చెందిన శక్తివేలు (49) రైతు. ఇతని భార్య కలెసైల్వి. వీరికి విశాంత్ అనే కుమారుడు ఉన్నారు. మైలాడుంపారైలో గల తన తోటకు తరచుగా వెళ్తున్న సమయంలో శక్తివేలుకు, మైలాడుంపారైకు చెందిన ఆరుసామి భార్య తాడగై (45)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ జంట తోటలో తరచుగా కలిసేవారు. అలాగే ఓరోజు శక్తివేలు, అతని ప్రియురాలు తాడగై తోటలో ఉండగా.. అక్కడ అలికిడి విని తాడగై కుమారుడు మురుగన్ (23) అక్కడికి వెళ్లి చూసి దిగ్భ్రాంతికి గురయ్యా డు.

దీన్ని గమనించిన ఆ జంట అక్కడి నుంచి పరుగులు తీశారు. మురుగన్ శక్తివేలును పట్టుకుని కత్తితో దాడి చేసి హతమార్చాడు. దీంతో మురుగన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన తల్లితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నందున అతన్ని హతమార్చినట్లు పోలీసులకు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement