చిన్నారిపై సవతి తల్లి దొంగ వీడియో! | mother Created Phony Videos to Cover Up 5-Year-Old's Injuries, Police Say | Sakshi
Sakshi News home page

చిన్నారిపై సవతి తల్లి దొంగ వీడియో!

Oct 17 2015 2:40 PM | Updated on Apr 4 2019 3:25 PM

చిన్నారిపై సవతి తల్లి దొంగ వీడియో! - Sakshi

చిన్నారిపై సవతి తల్లి దొంగ వీడియో!

ఐదేళ్ల బాలికను క్రూరంగా హింసించి.. ఆ చిన్నారి తనకు తానే గాయపడ్డట్టు కల్పిత వీడియో సృష్టించిన ఓ సవతి తల్లి ఉదంతమిది.

కనెక్టికట్: ఐదేళ్ల బాలికను క్రూరంగా హింసించి.. ఆ చిన్నారి తనకు తానే గాయపడ్డట్టు కల్పిత వీడియో సృష్టించిన ఓ సవతి తల్లి ఉదంతమిది. ఒక కన్ను పూర్తిగా ఉబ్బిపోయి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన బాలిక గత కొన్ని నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. కొంతకాలం ఎమర్జెన్సీ వార్డులో కూడా ఉంది. బాలిక తనకు తానే మంచానికి తలకొట్టుకొని గాయపడ్డదని, సవతి తల్లితోపాటు ఆ చిన్నారి కూడా చెబుతున్నది. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియోను సవతి తల్లి పోలీసులకు చూపించింది. అయితే వైద్య నివేదికలో మాత్రం అసలు విషయాలు వెలుగుచూశాయి.

చిన్నారిని జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్లి.. తీవ్రంగా కొట్టడం వల్ల ఆ గాయాలైనట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆ మహిళ చూపించిన వీడియో దొంగ వీడియో అని తేలింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. సవతి కూతురిని అమానుషంగా హింసించిన కనెక్టికట్కు చెందిన మహిళ ఫెలిషియా మేరీ (24)పై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. గత ఆగస్టులో మైనర్ బాలికను క్రూరంగా హింసించినట్టు అభియోగాలు మోపారు. బాలల హక్కుల పరిరక్షణ సంస్థ కూడా రంగంలోకి దిగి.. చిన్నారి ఒంటిపై కాలిన గాయాలు ఉన్నాయని  నివేదించింది. బాలిక తనకు తోచినట్టు చేస్తుందని, ఆమె తలను మంచానికి బాదుకున్నదని సవతి తల్లి సెల్ఫోన్లో చూపించిన వీడియో నకిలీ వీడియో అని వైద్యులు తేల్చడంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement