ప్రపంచంలో ప్రభావవంతులు వీరేనట | Modi, Kejriwal among 100 most influential people | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో ప్రభావవంతులు వీరేనట

Apr 14 2015 2:38 PM | Updated on Aug 15 2018 2:20 PM

ప్రపంచంలో ప్రభావవంతులు వీరేనట - Sakshi

ప్రపంచంలో ప్రభావవంతులు వీరేనట

ప్రపంచ ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చోటుదక్కించుకున్నారు.

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చోటుదక్కించుకున్నారు. ఓ జాతీయ మేగజిన్ నిర్వహించిన సర్వే ద్వారా ఈ విషయం వెల్లడైంది. త్వరలోనే పూర్తి వివరాలను ఆ మేగజిన్ అధికారికంగా ప్రకటించనుంది. అయితే, గతంలో నిర్వహించిన ఆన్లైన్ పోల్లో పొందిన ఓట్ల కన్నా ఈసారి తక్కువ ఓట్లు వీరు పొందినట్లు మేగజిన్ స్పష్టం చేసింది.

ఈ జాబితాలో చోటుదక్కించుకున్నవారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పాప్ స్టార్స్ లేడీ గగా, టేలర్ స్విప్ట్ కూడా ఉన్నారు. ఇక త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రకటించిన హిల్లరీ క్లింటన్తోపాటు, దలైలామా, హ్యారీ పోటర్ నటి ఎమ్మా వాట్సన్, నోబెల్ శాంతిబహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్, మిషెల్లీ ఒబామా, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కూడా ఇందులో చోటుదక్కించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement