సీఎం కేసీఆర్‌తో గోపీనాథ్, గాంధీల భేటీ | mla gopinath, gandi meets kcr | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌తో గోపీనాథ్, గాంధీల భేటీ

Mar 11 2016 3:52 AM | Updated on Aug 15 2018 9:30 PM

అధికార టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న టీ టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ గురువారం సీఎం కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు.

నేడు సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక
 సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న టీ టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ గురువారం సీఎం కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. వీరు రెండుసార్లు సీఎంను కలవడం, పార్టీ మారుతున్నట్లు స్పష్టం కావడంతో టీ టీడీపీ నుంచి వీరిద్దరినీ సస్పెండ్ చేశారు.

ఈ నేపథ్యంలోనే గోపీనాథ్, గాంధీ సీఎం కేసీఆర్‌తో మరోమారు భేటీ అయ్యారు. కాగా, వీరిద్దరూ శుక్రవారం సీఎం సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ‘సీఎం వీరిద్దరినీ శుక్రవారం మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఆ సందర్భంలోనే వారు సాదాసీదాగా సీఎం అధికార నివాసంలో చేరుతారా? లేక తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాట చేసి పార్టీలోకి వస్తారా అన్న విషయంపై చర్చిస్తారు..’ అని పార్టీ వర్గాలు చెప్పాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement