15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరంలో పరతాపూర్ ప్రాంతంలో సోమవారం వెలుగుచూసింది.
మీరట్(ఉత్తరప్రదేశ్): 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరంలో పరతాపూర్ ప్రాంతంలో సోమవారం వెలుగుచూసింది. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు వివేక్పై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందనీ, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.