నగరంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్‌గూడలో సోమవారం అర్ధరాత్రి పోలీసు చెక్‌పోస్టుపైకి లారీ దూసుకొచ్చింది.
హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్‌గూడలో సోమవారం అర్ధరాత్రి పోలీసు చెక్‌పోస్టుపైకి లారీ దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో రాహుల్ యాదవ్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందారు. కానిస్టేబుళ్లు సైదులు, పవన్, వీరేంద్రలకు తీవ్ర గాయాలయ్యాయి.
వీరిలో పవన్, వీరేంద్రల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వీరిని చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా సైదులుకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ యాదగిరి రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.