ట్రంప్ కోసం ఆయన భార్య న్యాయపోరాటం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై వస్తున్న అసత్య ఆరోపణలపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది ఆయన భార్య మెలానియా ట్రంప్.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై వస్తున్న అసత్య ఆరోపణలపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది ఆయన భార్య మెలానియా ట్రంప్. డొనాల్డ్ ట్రంప్పై పూర్తిగా కాల్పనికంగా, తప్పుడు వ్యాఖ్యలు రాసినందుకు పీపుల్ మ్యాగజేన్, మాజీ స్టాఫ్ రిపోర్టర్పై దావా వేసేందుకు సిద్ధమయ్యారు. పీపుల్ మ్యాగజైన్ రచయిత నటాషా స్టోయినాఫ్ 2005లో ఓ ఇంటర్యూ సమయంలో ట్రంప్ తనను బలవంతంగా ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడంటూ ఆయన అసభ్యకర ప్రవర్తనను బయటపెట్టింది. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమంటూ మెలానియం ట్రంప్ కొట్టిపారేశారు. పబ్లికేషన్ ఎడిటోరియల్ డైరెక్టర్ జెస్ క్యాగెల్, రచయిత నటాషా స్టోయినాఫ్లకు నోటీసులు జారీచేశారు. 24గంటల లోపు ఆ స్టోరీను తొలగించాలని లేదంటే మెలానియం నమోదుచేసే దావాపై న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె లాయర్ చార్లెస్ హార్డర్ హెచ్చరించారు.
ఈ అసత్యపూర్వక రాతలపై క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ నటాషాకు ఓ లేఖను పంపారు. అసలు నిజలేమిటంటే అని.. నటాషాకు, ట్రంప్కు మధ్య అసలు ఎలాంటి సంభాషణ జరుగలేదని, అసలు వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ కారని చార్లెస్ హార్డర్ పేర్కొన్నారు. మొత్తం ఆరుగురు మహిళలు లైగికంగా తమను ట్రంప్ వేధించాడంటూ ఆరోపణలు చేస్తున్నట్టు న్యూయార్క్ టైమ్స్, ఎన్బీసీ, పీపుల్ మ్యాగజేన్ రిపోర్టు చేశాయి. ట్రంప్ ఎన్నడూ మహిళలను వేధించలేదంటూ మెలానియా లాయర్ పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్కు వ్యతిరేకంగా దావాను నమోదుచేేసే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు.