మారుతి ఇగ్నిస్ వచ్చేసింది..ధర ఎంత? | Maruti Suzuki Ignis launched in India at Rs 4.59 lak | Sakshi
Sakshi News home page

మారుతి ఇగ్నిస్ వచ్చేసింది..ధర ఎంత?

Jan 13 2017 4:57 PM | Updated on Sep 5 2017 1:11 AM

పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో ఉన్న ఈ మోస్ట్ ఎవైటెడ్ కారు భారత మార్కెట్లోకి వచ్చేసింది.

ముంబై: వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి తాజా కారు ఇగ్నిస్ శుక్రవారం లాంచ్ అయింది. పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో ఉన్న ఈ మోస్ట్ ఎవైటెడ్ కారు భారత మార్కెట్లోకి వచ్చేసింది. పెట్రోల్ వెర్షన్ రూ.4.59 లక్షలు, డీజిల్ వేరియంట్ రూ.6.39 లక్షల చొప్పున ప్రారంభ ధరలుగా మారుతి నిర్ణయించింది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ 7.46 లక్షలుగా పేర్కొంది. ఇవి ఢిల్లీలోని ఎక్స్ షోరూమ్ ధరలు. మొత్తం ఆరు రంగుల్లో ఈ కారు లభ్యమవుతుంది. అప్టౌన్ రెడ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, బ్లూ, అర్బన్ బ్లూ,  గ్రే మరియు సిల్కీ సిల్వర్ రంగుల్లో వస్తోంది. డీజిల్ ఇంజన్ లీటరుకు నగరాల్లో అయితే 19, ప్రామాణిక పరిస్థితుల్లో అయితే 26.80 కి.మీ, పెట్రోల్ వేరియంట్ లీటరుకు నగరాల్లో 16, ప్రామాణిక పరిస్థితుల్లో 20.89 కి.మీ చొప్పున మైలేజి వస్తుందిన కంపెనీ పేర్కొంది. పోటీదారులను ఎదుర్కోవడానికి మారుతి బలమైన ఆయుధం మైలేజ్ అన్నది మార్కెట్ వర్గాల భావన.
 
ఆటోమేటెడ్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ను మారుతి ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ గా మారుతి పిలుస్తోంది. మారుతి సుజుకి తమ డీజల్ ఇగ్నిస్ లోని మధ్య వేరియంట్లయిన డెల్టా మరియు జెటాలలో మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేస్తోంది. అయితే ఇగ్నిస్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫాలో మాత్రం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లేదు. సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫాగా మొత్తం నాలుగు వేరియంట్లలో ఇగ్నిస్ లాంచ్ అయింది. సిగ్మా కేవలం పెట్రోల్ ఇంజిన్ కాగా, మిగిలిని రెండు వేరియంట్లలోనూ అందుబాటులో ఉంటాయి. హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, టచ్ స్క్రీన్ ఆపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ రిమోట్ కీలెస్ ఎంట్రీ  ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.
 
కాగా ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లోని డీజల్ కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అందిస్తున్న ఏకైక సంస్థ మారుతి సుజుకి, తమ అప్ కమింగ్ ఇగ్నిస్ కారులోని పెట్రోల్‌తో పాటు డీజల్ వేరియంట్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందిస్తోంది. గతంలో కూడా మారుతినే మొదటి సారిగా పెట్రోల్ వేరియంట్ లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసింది. ఇప్పుడు ఇగ్నిస్ ద్వారా డీజల్ వేరియంట్లో మారుతినే మొదటిసారిగా ఈ ఆప్షన్‌ను పరిచయం చేస్తోంది. అంతేకాదు రూ.10 లక్షలలోపు కార్లలో ఎల్ఈడీ లైట్ల సదుపాయం కల్పిస్తున్న మొదటి సంస్థ కూడా మారుతి సుజుకినే కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement