ఫేస్బుక్ ప్రేమికుడి కోసం వచ్చి చనిపోయింది | Married mother-of-three dies in India just days after travelling to country to meet lover | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ ప్రేమికుడి కోసం వచ్చి చనిపోయింది

May 20 2015 7:32 PM | Updated on Jul 27 2018 12:33 PM

ఫేస్బుక్ ప్రేమికుడి కోసం వచ్చి చనిపోయింది - Sakshi

ఫేస్బుక్ ప్రేమికుడి కోసం వచ్చి చనిపోయింది

ఆమె బ్రిటన్కు చెందిన ఓ ముగ్గురు బిడ్డల తల్లి. భారత్లోని ఓ పంజాబ్ యువకుడితో ఫేస్బుక్ ద్వారా ప్రేమలో పడింది. ఇటీవల ఇండియాకు వచ్చి చూసి చనిపోయింది.

పంజాబ్: ఆమె బ్రిటన్కు చెందిన ఓ ముగ్గురు బిడ్డల తల్లి. భారత్లోని ఓ పంజాబ్ యువకుడితో ఫేస్బుక్ ద్వారా ప్రేమలో పడింది. ఇటీవల ఇండియాకు వచ్చి చూసింది. ఇందులో విషాదమేంటంటే ఆమె ఇండియాకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రాణాలుకోల్పోయింది. వివరాల్లోకి వెళ్లితే ఎంజెలా స్లిన్ (45) అనే బ్రిటన్ మహిళ పంజాబ్లోని లుథియానాకు చెందిన జస్పాల్ సింగ్(30) అనే వ్యక్తికి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. వారి వ్యవహారం ప్రేమ వరకు దారి తీసింది. దీంతో ఇటీవలె ఆమె తన పిల్లలకు ఇండియా టూర్ వెళుతున్నానని చెప్పి, ఆ విషయం భర్త స్టీపెన్ (48)కు మాత్రం చెప్పకుండా మే 4న ఇండియాకు వచ్చింది.

వచ్చి సింగ్ను కలిసిన వారం రోజుల్లో తీవ్ర న్యుమోనియాకు గురై ఆస్పత్రిలో చనిపోయింది. ఈ ఘటనపై ఎంజెలా అత్త డొరీన్ స్లిన్ స్పందిస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఎంజెలా ఎందుకు ప్రాణాలు కోల్పోయిందో తనకు అర్థం కాలేదని, తాను మరో వ్యక్తితో ప్రేమలో పడిందని తెలిసిందని, అతడిని కలుసుకునేందుకు ఇండియా వెళ్లి చివరకు విషాధంగా మిగిలిపోయిందని చెప్పింది. జస్పాల్ సింగ్ కూడా తీవ్ర బాధను వ్యక్తం చేశాడు. ఆమె లేదనే విషయాన్ని తాను నమ్మలేక పోతున్నానని అన్నాడు. సతీష్ చందర్ దావన్ ప్రభుత్వ కాలేజీలో చదివిన సింగ్ ఎంజెలా పొటోగ్రాప్లపై ఎన్నో కామెంట్లు పెట్టేవాడు. వాటిల్లో బ్యూటిఫుల్, మైలవ్ అనే పదాలే ఎక్కువగా ఉండేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement