న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (AI) సేవలను అభివృద్ధి చేసేందుకు మెటా ప్లాట్‌ఫామ్స్, ఫేస్‌బుక్ ఓవర్సీస్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఈ జాయింట్ వెంచర్‌లో రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్ ఇంటెలిజెన్స్‌లిమిటెడ్ వాటా 70%, ఫేస్‌బుక్ ఓవర్సీస్ వాటా 30 శాతం ఉంటుందని పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ కోసం రెండు కంపెనీలు రూ.855 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన అనుబంధ సంస్థ రిలయన్స్‌ఇంటెలిజెన్స్‌లిమిటెడ్ 2025 అక్టోబర్ 24న రిలయన్స్‌ఎంటర్ ప్రైజ్ ఇంటెలిజెన్స్‌లిమిటెడ్(ఆర్‌ఈఐఎల్)ను ప్రారంభించింది.
ఈ జాయింట్ వెంచర్ ఎంటర్‌ప్రైజ్ ఏఐ సొల్యూషన్స్‌పై దృష్టి సారించిందని రిలయన్స్ పేర్కొంది. ఈ జేవీ ఏర్పాటుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదని రిలయన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఇదీ చదవండి: పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?


