ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జాంగ్ల అడవిలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జాంగ్ల అడవిలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో కొంతమంది మావోయిస్టులు చనిపోయారని భావిస్తున్నారు. పోలీసులు నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.